Cheap Tips

అందమైన మొఖం కోసం .... అంతులేని చిట్కాలు

మీరు యవ్వనంలో ఉన్నారా, కాని మీ చర్మం ముడతలు పడి మిమ్మల్ని ముసలి వారిలా చుపిస్తుందా, అయితే ఎంకెందుకు ఆలస్యం అందమైన మీ చర్మాన్ని, మీ వయసుతో పాటే పయనించేల, అదే ముడతలు లేకుండా కాపాడుకునేల ఏం చేయాలో తెలుసుకుందామ :

 మీ చర్మం ముడతలు పడటానికి అనేక కారణాలున్నాయి,తేమ తత్వం తగ్గడం అంటే పొడిగా ఉండడం, చర్మంలోని కణాల ఉత్పత్తి సరిగా లేకపోవడం, మీ యొక్క జీవనశైలి, వాతావరణంలోని మార్పులు,  స్మోకింగ్,మానసిక ఒత్తిడి, ఆహారం సరిగా తీసుకోక పోవడం, వ్యాయామం చేయకపోవడం ఇలా ఎన్నో ఉన్నాయి.

 అందమైన చర్మం కోసం మీరు చేయవలసిందల్లా, మీరు పడుకునే ముందు,  నెయ్యి , బాదం నూనె లేదా కొబ్బరి నూనె ని మీ ముఖానికి రాసుకుంటే, ముడతలు పోయి మంచి మృదువైన చర్మం లభిస్తుంది.

 కలబంద రసాన్ని మీ ముఖానికి రాయడం వల్ల మీ ముఖం ఎంతో తాజాగా, అందంగా, ముడతలు తగ్గి కాంతివంతంగా ప్రకశిస్తుంది. కీరా దోసకాయతో “ఫేస్ ప్యాక్” వేసుకుంటే, చర్మంలో తేమతనం పెరిగి మంచి ఫలితాలు లభిస్తాయి.